Yaadi....manaadi!!!
యాది . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . మనాది!!! అన్నా , నీ విషయం తెలియక చాలా రోజులైయ్యింది , అందరితో మాట్లాడినా ఏం అర్ధం కావటంలేదు ..... అంతా భ్రాంతిగా , కలవరింతగా , గాభరాగా , భయంగా ఉంది . ఇంకా ఉండబట్టలేక , నాన్నను ఒకసారి తల్చుకొని , నీకే డైరెక్టుగా రాస్తున్నాను . రాస్తుంటే ఎన్నో గుర్తొస్తున్నాయి .... అప్పుడు నేను బొంబాయి లో ఉన్న , నువ్వు నాకు ఉత్తరం రాసినవు .....which is a rare event! Dearest Yugandar అని మొదలయ్యింది ఉత్తరం ..... మా అన్నకు మేమంటే ఇంతిష్టమా అని ఉత్తరం చదవకుండానే ఉబ్బి తబ్బిబ్బయ్యాను , చదవవలిసిన అవసరం లేకుండనే మనసుకు , గుండెకు అర్ధం అయిపోయింది . పెద్దగా ఉద్బోధ అవసరం లేకుండనే నువ్వు చెప్పేవి చెప్పనివి అన్నీ సహజంగా అర్ధం అయ్యేవన్నా .... నీ మాట వినడమే , గర్వంగా ఉండేది . నాన్న కాప్రా లో ఉన్న టైం కావొచ్చు ... సైకిల్ మీద నన్ను వి వి అప్పర్ ప్రైమరీ కు తీసుకొనిపోయి అక్కడ వైస్ ప్రిన్సిపల్ తో మాట్లాడి అడ్మిషన్ చేయించిన...